ప్రయాణికుల సురక్షిత ప్రయాణంపై దృష్టి
ధర్మవరం అర్బన్: రైల్వే ప్రయాణికుల సురక్షిత ప్రయాణంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారిపై ఉందని ప్రిన్సిపల్ చీఫ్ రైల్వే సేఫ్టీ ఆఫీసర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ధర్మవరం రైల్వేస్టేషన్‌ను గురువారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. రైల్వేస్టేషన్‌లోని వివిధ విభాగాల కార్యాలయాల రికార్డులను పరిశీలించారు. ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లేలా సిద్ధమై ఉండాలన్నారు. అనంతరం గొల్లపల్లి రైల్వే గేటును తనిఖీ చేశారు. తర్వాత సిగ్నల్ సిస్టం గదులు, స్టేషన్ మాస్టర్ గదులు, ప్రయాణికులు వేచి ఉండే గదులను పరిశీలిస్తూ ప్రయాణికుల ద్వారా సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం సుధాకర్, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ రవిచంద్రన్, స్టేషన్‌మాస్టర్ నరసింహనాయుడు, ఆర్పీఎఫ్ సీఐ బోయకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment