ప్రశాంతి నిలయం: కరువు పరిస్థితులు తెలుసుకునేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన ముగ్గురు సభ్యులతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం బుధవారం జిల్లాలో పర్యటించనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సెక్రెటరీ దీప్ శేఖర్ సింగల్, హైదరాబాద్‌లోని ప్రభుత్వ నూనె విత్తనాల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్.కె పొన్ను స్వామి, ఆహార ప్రజా పంపిణీ సంస్థ డైరెక్టర్ ప్రియా జాకబ్ తదితరులతో కూడిన కమిటీ సభ్యులు మంగళవారం రాత్రే ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్‌కు చేరుకున్నారు. అక్కడే వారికి బస సౌకర్యం ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం వారు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి గత రబీలో దెబ్బతిన్న పంటలతో పాటు, బాధిత రైతులతో మాట్లాడనున్నారు.
కరువు బృందం పర్యటన సాగనుందిలా...
పంటల దిగుబడులు, కరువు పరిస్థితులను పరిశీలించేందుకు విచ్చేసిన కరువు బృందం సభ్యులు పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
● ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్‌లో బుధవారం ఉదయం 8.45 గంటలకు కరువు బంృందం సభ్యులు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలచికొన్న కరువు పరిస్థితులను జిల్లా వ్యవసాయ అధికారులు, ఉన్నతాధికారులు వివరించనున్నారు.
● ఉదయం 9 గంటలకు శాంతి భవన్ నుంచి బయలుదేరనున్న కరువు బృందం సభ్యులు 10 గంటలకు ముదిగుబ్బ మండలం జొన్నల కొత్తపల్లికి చేరుకుని అక్కడ రైతులు సాగు చేసిన కంది, వేరుశనగ పంటలను పరిశీలిస్తారు. అనంతరం రైతులతో సమావేశమై చర్చిస్తారు.
● 11.30 గంటలకు జొన్నల కొత్తపల్లి నుంచి బయలుదేరి రామాపురం మీదుగా తాడిమర్రికి చేరుకుంటారు.
● 11.50 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు తాడిమర్రిలో ఉలవ, జొన్న పంటలను పరిశీలిస్తారు. అనంతరం రైతులతో సమావేశమవుతారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం అక్కడి నుంచి అనంతపురం జిల్లాకు బయలుదేరి వెళ్తారు.
Comments
Please login to add a commentAdd a comment