స్కూల్ ప్రహరీ కూలి విద్యార్థికి గాయాలు
లేపాక్షి: మండల పరిధిలోని కుర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రహరీ కూలగా, ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు...కుర్లపల్లి గ్రామానికి చెందిన రమేష్, గౌతమిల కుమారుడు తనూష్ గ్రామంలోని పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం విద్యార్థి మూత్ర విసర్జన కోసం ప్రహరీ వద్దకు వెళ్లాడు. అదే సమయంలో శిథిలావస్థలో ఉన్న ప్రహరీ కూలిపోయింది. ఈ ఘటనలో తనూష్ ఎడమ కాలుకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పాఠశాల ఉపాధ్యాయులు తనూష్‌ను 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ నాగరాజు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థిని పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment