చౌక దుకాణాల్లో ‘విజిలెన్స్’ తనిఖీలు
కదిరి టౌన్: మున్సిపల్ పరిధిలోని పలు చౌకధాన్యపు దుకాణాల్లో మంగళవారం రాత్రి విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుటాగుళ్లలోని 22వ షాపు, అడపాలవీధిలోని 18వ నంబర్ దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న నిల్వకు, రికార్డుల్లో నమోదు చేసిన స్టాక్‌కు వ్యత్యాసం ఉండటంతో డీలర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆర్డీఓ విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారని విజిలెన్స్ అధికారులు తెలిపారు. తనిఖీలో విజిలెన్స్ సీఐ జమాల్ బాషా, డీసీటీఓ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment