రాయదుర్గంటౌన్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు రాకపోకలు సాగించేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీ డివిజన్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడానికి ఇప్పటికే కోట్లాది మంది తరలివెళుతున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ వరకూ కుంభమేళా జరగనుంది. ఈ క్రమంలో నెలలో ఒక ట్రిప్పు చొప్పున జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో రాయదుర్గం, బళ్లారి మీదుగా మైసూరు–దానాపూర్–మైసూర్ ప్రత్యేక రైలును నడుపుతున్నారు. జనవరి 18, ఫిబ్రవరి 15, మార్చి 1 తేదీ శనివారాల్లో మైసూరులో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరిన రైలు (06207) బెంగళూరు, చిత్రదుర్గ, రాయదుర్గం, బళ్లారి కంటోన్మెంట్, హుబ్లీ, విజయపుర, సత్నా, ప్రయాగ్‌రాజ్ మీదుగా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌కు చేరుకుంటుంది. అలాగే జనవరి 22న, ఫిబ్రవరి 19, మార్చి 5న బుధవారాల్లో దానాపూర్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత 1.45 గంటలకు బయలుదేరిన రైలు (06208) అదే స్టేషన్ల మీదుగా మైసూరుకు చేరుకుంటుంది.
చిరుత దాడిలో మేక మృతి
మడకశిర రూరల్: మండలంలోని కల్లుమర్రి గ్రామ సమీపంలో పొలాల్లో మేత మేస్తున్న మేకలపై గురువారం చిరుత దాడి చేసింది. ఘటనలో ఓ మేక చనిపోయింది. కాపరి నారాయణ నుంచి సమాచారం అందుకున్న అటవీశాక అధికారి కుళ్లాయప్ప అక్కడకు చేరుకుని పరిశీలించారు. పశు వైద్యాధికారితో పంచనామా నిర్వహించి, నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు పేర్కొన్నారు.
రేషన్ బియ్యం స్వాధీనం
అనంతపురం: నగరంలోని సాయినగర్ మొదటి క్రాస్, రామన్ స్కూల్ సమీపంలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండో పట్టణ సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపిన మేరకు... రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమై గురువారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రామన్ స్కూల్ వద్ద బొలెరో వాహనంలో తరలిస్తున్న 2,146 కిలోల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, పుట్టపర్తి మండలం బుగ్గపల్లికి చెందిన గుడిపాటి హరికృష్ణ, అనంతపురంలోని సాయినగర్ మొదటి క్రాస్‌కు చెందిన పసుపుల సురేష్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment