అనంత వేదికగా లఘు చిత్రాల పండుగ
అనంతపురం కల్చరల్: అనంత వేదికగా మరో లఘు చిత్రాల పండుగ ఈ నెలలో ప్రారంభం కానుంది. అనేక ప్రాంతాల నుంచి విచ్చేసే బుల్లితెర నటీనటులతో మరో చిత్రోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం అనంతపురం ఫిలిం సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినీ దర్శకుడు రషీద్ బాషా, టీవీ–సినీనటుడు రమేష్ నీల్, విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీధర్, సీనియర్ డ్యాన్స్ మాస్టర్ కత్తి విజయ్‌కుమార్, సామాజిక సేవా కార్యకర్త తోట బాలన్న తదితరులు మాట్లాడారు. గతంలో అనంత వేదికగా 6 సార్లు లఘు చిత్రోత్సవం నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహిస్తూ మరోసారి 18 కేటగిరీలలో ఉత్తమ చిత్రాలకు, సాంకేతిక నిపుణులకు, నటీనటులకు, డైరెక్టర్లకు ఉత్తమ పురస్కారాలనందిస్తామన్నారు. ఇప్పుడిప్పుడే రాణిస్తున్న దర్శక, నిర్మాతలను ప్రోత్సహించేందుకు జీఎంఎస్ గ్యాలరీ సహకారంతో రూ.50 వేల బడ్జెట్‌తో తామే లఘుచిత్రం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 25వ తేదీలోపు ఎంట్రీలను పంపాలని కోరారు. పూర్తి వివరాలకు 96763 50651, 72880 22467 నంబర్లలో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment