మద్యపాన నిషేధిత గ్రామంగా బోర్డు ఏర్పాటు
పావగడ: తమ గ్రామంలో మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించి శాంతి భద్రతలు నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ వదనకల్ గ్రామస్తులు గురువారం వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామ నడిబొడ్డున ‘మద్యపాన నిషేధిత గ్రామం’ అని బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రముఖుడు బ్రహ్మేంద్రచార్ మాట్లాడారు. గ్రామంలో మద్యం విక్రయాలతో మందుబాబుల బెడద ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా యువకులు మద్యానికి బానిసై పెడదారి పడుతున్నారన్నారు. సాయంత్రం గ్రామంలో మహిళలు స్వేచ్ఛగా బయట తిరగలేకపోతున్నారన్నారు. ఎకై ్సజ్ అధికారులు, పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా మద్యం విక్రయాలను అరికట్టలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులంతా సమావేశమై చర్చించుకున్న అనంతరం తమ గ్రామాన్ని మద్యపాన నిషేధిత గ్రామంగా పేర్కొంటూ గ్రామ నడిబొడ్డున బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి గ్రామంలో మద్యం అమ్మకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే వెంకటేష్‌ను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. అనంతరం ఇకపై తమ గ్రామంలో మద్యం విక్రయాలు చేపట్టకూడదని విక్రయదారులను హెచ్చరించారు.
ఆదర్శంగా నిలిచిన
వదనకల్ గ్రామస్తులు
మద్యం విక్రయాలను
పూర్తిగా నిషేధించాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment