ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి
హిందూపురం అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా రవాణా అధికారి కరుణసాగరరెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15వ తేదీ వరకూ నిర్వహించే రహదారి జాతీయ భద్రతా మాసోత్సవాలను గురువారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, డ్రైవింగ్ సమయంలో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు, ర్యాలీలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన..
ప్రమాదరహిత డ్రైవింగ్‌పై ఆర్టీసీ డ్రైవర్లకు గురువారం ఎంవీఐ జయశ్రీ అవగాహన కల్పించారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితమని చాలా మంది భావిస్తుంటారని, ఆ దిశగా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని డ్రైవర్లకు సూచించారు. బస్సు ఎక్కే సమయంలో, దిగే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రదేశాల్లో ఓవర్‌టేక్ చేయాలి, రద్దీ ప్రదేశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ఆర్టీసీ డీఎం శ్రీకాంత్ మాట్లాడుతూ... ఆర్టీసీ తరపున ఏ ఒక్కరూ ప్రమాదానికి గురి కాకూడదన్న లక్ష్యంతో వాహనాలను నడపాలని డ్రైవర్లకు సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బింది, డ్రైవర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment