గోరంట్ల: కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడిన కేసులో గోరంట్ల పట్టణానికి చెందిన మారగానికుంట సోముశేఖర్ అనే వ్యక్తికి గురువారం పెనుకొండ ప్రిన్సిపల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి బొజ్జప్ప రూ.2 లక్షల జరిమానా విధించినట్లు సీఐ శేఖర్ తెలిపారు. ఆయన వివరాలమేరకు.. మారగానికుంట సోముశేఖర్ 2020 సంవత్సరం ఆగస్టు 18న కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా కర్ణాటక విస్కీ, టెట్రా ప్యాకెట్లు 122 తరలిస్తుండగా అప్పట్లో గోరంట్ల పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. నేరం రుజువు కావడంతో సోముశేఖర్‌కు రూ.2లక్షల జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment