మంత్రి సవిత తీరుమార్చుకోవాలి
పుట్టపర్తి టౌన్: రాష్ట్ర మంత్రి సవిత తన స్వప్రయోజనాలకు పోలీస్ వ్యవస్థను వాడుకొంటూ నియోజవర్గ వ్యాప్తంగా అరాచకాలు, ఆక్రమణలు, భూదందాలు, సెటిల్‌మెంట్లు చేస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికై నా ఆమె తీరు మార్చుకోవాలి’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ హెచ్చరించారు. గురువారం పెనుకొండ నియోజవర్గంలో పోలీసుల బెదింపులకు గురైన బాధితులతో కలసి వచ్చి అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్ కార్యాలయ ఆవరణలో విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. పెనుకొండ నియోజవర్గంలో మంత్రి సవితతో పాటు ఆమె అనుచరులు భూదందాలు, అరాచకాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారన్నారు. పోలీసులు ఆమెకు వత్తాసు పలుకుతూ వైఎస్సార్‌సీసీ కార్యకర్తలను బెదిరింపులకు దిగుతుండటం బాధాకరమన్నారు. ముష్టికోవెల గ్రామంలో రెండు నెలల క్రితం సుధాకర్‌రెడ్డి టీడీపీ నేతల బెదిరింపులతో ఆత్మహత్య చేసుకున్నాడని, వారి మీద పోలీసులు సెక్షన్ 306 కేసు నమోదు చేశారన్నారు. అయితే నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోకుండా కేసు రాజీ కావాలని ఒత్తిడికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. గుట్టూరులో ఓ మహిళపై దాడి చేయడంతో పాటు ఆమె కొప్పు కోశారన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. జిల్లా సరిహద్దుల్లో ఇసుక అక్రమంగా కర్ణాటక ప్రాంతాలకు తరిలిపోతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదన్నారు. సోమందేపల్లిలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని, అయితే మంత్రి సవిత జన్మదిన వేడుకలు ఉన్నాయని ప్లెక్సీని తొలగించాలని, లేకుంటే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడం దారుణమన్నారు. అక్రమాలకు పాల్పడుతూనే మంత్రి సవిత స్వప్రయోజనాలకు పోలీసులను సైతం వాడుకుంటున్నాని మండిపడ్డారు. ఎన్నోరోజులు ఇలాంటి ఆటలు సాగవన్నారు. మంత్రి సవిత, పోలీసులు తీరు మార్చుకోకుంటే ఉద్యమాలకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. క్షేత్రస్థాయిలో విచారించి బాధితులకు న్యాయం చేస్తామని అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు ఫక్రోద్దీన్, పెనుకొండ మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ గంగిరెడ్డి, యువనాయకులు ఈశ్వర్‌యాదవ్, లక్ష్మీనారాయణ, కలందర్‌బాషా, బాధితులు రఘురామిరెడ్డి, హేమలత, మారుతీరెడ్డి, నాగభూషణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్
జిల్లాలో పోలీస్ పనితీరుపై
అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment