![ఏపీ అమరావతి జేఏసీ మహిళా విభాగం జిల్లా కమిటీ ఎంపిక](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11hdp104-110125_mr-1739300535-0.jpg.webp?itok=7kPT399s)
ఏపీ అమరావతి జేఏసీ మహిళా విభాగం జిల్లా కమిటీ ఎంపిక
హిందూపురం టౌన్: ఏపీ అమరావతి జేఏసీ మహిళా విభాగం జిల్లా కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి డివిజన్ స్థాయి మహిళా ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ అమరావతి జేఏసీ మహిళా విభాగం రాష్ట్ర చైర్‌పర్సన్ పారే లక్ష్మి, ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, జిల్లా చైర్మన్, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా జనరల్ సెక్రెటరీ మైనుద్దీన్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు దివాకర్ రావు, లేపాక్షి, పరిగి తహసీల్దార్‌లు సౌజన్యలక్ష్మి, హసీనా సుల్తానా తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. పెనుకొండ డివిజన్ చైర్‌పర్సన్‌గా హిందూపురంలోని ముదిరెడ్డిపల్లిలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ఎడిత్ రోజ్, ప్రధాన కార్యదర్శిగా మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్న రమాదేవి, చైర్‌పర్సన్‌లుగా వీఆర్‌ఓలు గీతాంజలి, సుభాషిణి, కార్యదర్శులుగా బేబీ, కవిత, సుమిత్ర, ట్రెజరర్‌గా చంద్రను ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో మహిళలపై లైంగిక వేధింపులను నమోదు చేయడానికి, పర్యవేక్షించడానికి ఒక కేంద్రీకృత వేదిక అయినా షీ–బాక్స్ పోర్టల్‌ను తొలుత కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో షీ–బాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా శిశు సంరక్షణ కోసం మహిళలకు రెండేళ్ల కాలానికి సెలవులను పెంచాలన్నారు. ఐఆర్‌తో పాటు పీఆర్సీ కమిటీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment