డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
మాట్లాడుతున్న డీఐజీ
గోపీనాథ్ జెట్టి
● ‘సంకల్పం’ కార్యక్రమంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి
ఎచ్చెర్ల క్యాంపస్: డ్రగ్స్ (మాదక ద్రవ్యాలు) రహిత సమాజం లక్ష్యంగా పోలీస్ శాఖ ముందుకు సాగుతుందని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో మంగళవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంకల్పంలో భాగంగా ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబంలో ఒకరు డ్రగ్స్‌కు బానిసైనా కుటుంబం మొత్తంపై ప్రభావం చూపుతుందన్నారు. కళాశాలలు, విద్యా సంస్థలు యాండీ డ్రగ్స్ స్క్వాడ్‌లు నిర్వహించాలని, ఎటువంటి డ్రగ్స్ అమ్మకాలు ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కొని విలువైన జీవితం నాశనం చేసుకోవద్దన్నారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలన్నారు. అనంతరం ఈగల్ టాస్క్‌ఫోర్స్, డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్లాష్‌మాబ్స్, స్కిట్లు అలరించాయి. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, ఆర్‌జీయూకేటీ ఎస్‌ఎంపురం క్యాంపస్ డైరెక్టర్ కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ, అదనపు ఎస్పీ కేవీ రమణ, శివానీ కళాశాల యాజమాన్య సభ్యులు దుర్గా శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్‌రాజు, సనపల శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, సీఐలు అవతారం, ఇమ్మూన్యుయేల్‌రాజు, ఈశ్వరరావు, పైడపు నాయుడు, ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment