లఘుచిత్ర పోటీల విజేతగా జి.సిగడాం మోడల్ స్కూల్
జి.సిగడాం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) నిర్వహించిన లఘుచిత్రం పోటీల్లో జి.సిగడాం మోడల్ స్కూల్ విద్యార్థులు రూపొందించిన ‘పవర్ ప్రేమికుడు’ అనే షార్ట్ ఫిల్మ్‌కు ప్రథమ బహుమతి దక్కిందని ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నా శామ్యేల్ లంక మంగళవారం తెలిపారు. విద్యుత్ ఎలా వాడాలి.. ఎలా పొదుపు చేయాలి అనే అంశంపై ఈ లఘుచిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 20న విజయవాడలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందుకుంటారని పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్థులు వైకుంఠరావు, డోల వరప్రసాదరావు, ఈశ్వర్, తేజ నటించిన ఈ చిత్రం రూపొందించేందుకు తెలుగు అధ్యాపకులు కోట తిరుపతిరావు, షలీమ్ కృషి చేశారని తెలిపారు.
లఘుచిత్రంలో ఓ సన్నివేశం
Comments
Please login to add a commentAdd a comment