చికిత్స పొందుతూ వివాహిత మృతి
నరసన్నపేట: స్థానిక జోగిపేటకూడలికి చెందిన నారాయణశెట్టి భవాని (35) చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. భర్త శ్రీధర్‌తో కలిసి ఆదివారం పోలాకి మండలం రాజారాంపురంలో వన భోజనానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా పోలాకి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గాయపడిన భవానీని రిమ్స్‌లో చేర్పించగా పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మృతి చెందింది. ఈమెకు ఇద్దరు పిల్లలు. పోలాకి పోలీసులు కేసు నమోదు చేశారు.
గాయపడిన వ్యక్తి మృతి
ఆమదాలవలస: మండలంలోని ముద్దాడపేటకు చెందిన లాస ఎర్రయ్య(40) శనివారం మధ్యాహ్నం ఆమదాలవలస నుంచి తన ఇంటికి వెళుతుండగా తమ్మయ్యపేట సమీపంలో ట్రాక్టర్ ఢీకొనడంతో గాయపడ్డాడు. 108 అంబులెన్సులో రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. మృతుడికి భార్య దుర్గ, కుమార్తె జస్మిత, కుమారుడు జ్ఞానేశ్వర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment