నౌపడ టీడీపీలో ఆధిపత్య పోరు
సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ తెలుగుదేశం పార్టీలో ఎంపీపీ భర్త కర్రి విష్ణుమూర్తి, టీడీపీ నాయకుడు సుగ్గు శాంతి స్వరూప్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. విష్ణుమూర్తి వర్గానికి చెందిన అనపాన నగేష్ నౌపడ వైఎస్‌ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇంటి వద్ద మురుగుకాలువను కొందరు కప్పి వేయడంతో పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఇప్పటికి నాలుగు నెలలు కావస్తున్నా సొంత పార్టీ నాయకుల వల్లే సమస్య పరిష్కారం కావడం లేదంటూ మంగళవారం నౌపడ గ్రామ సచివాలయం వద్ద నిరసనకు దిగారు. కుటుంబంతో సహా పెట్రోల్ బాటిల్ పట్టుకొని బైఠాయించారు. అయినా సిబ్బంది పట్టించుకోకుండా సచివాలయానికి తాళాలు వేసి వెళ్లిపోవడంతో కొంతసేపటి తర్వాత నగేష్ కూడా వెనుతిరిగారు.
పెట్రోల్ బాటిల్ పట్టుకొని బైఠాయించిన
టీడీపీ కార్యకర్త నగేష్, కుటుంబసభ్యులు
Comments
Please login to add a commentAdd a comment