నేటి నుంచి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో బుధవారం నుంచి ఈ నెల 23 వరకు జరగనున్న శాఖాపరమైన(డిపార్ట్‌మెంటల్) పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు అధికారులను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్లో పరీక్షల నిర్వహణపై మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎచ్చెర్లలోని శ్రీశివాని ఇంజనీరింగ్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కోర్ టెక్నాలజీస్ (నరసన్నపేట)కళాశాలల వేదికగా పరీక్షలు జరుగుతాయని వివరించారు. గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రెటరీ వెంకటలక్ష్మి మాట్లాడుతూ పరీక్షలకు 1831 మంది ఉద్యోగులు హాజరుకానున్నట్లు వివరించారు. సమావేశంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ వెంకటలక్ష్మి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఎం.అమ్మాజీ, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ చక్రవర్తి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శ్రీకాంత్, సీఐ దేవరకొండ ప్రసాద్, శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్‌వో అప్పారావు
Comments
Please login to add a commentAdd a comment