రోజులు జాగ్రత్త
● నేటి నుంచి వానలు పడే అవకాశం
● జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందని, రైతులు ఖరీఫ్ వరి పంట, ధాన్యంను జాగ్రత్త చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ ఆహ్మద్ ఖాన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో నూర్పులు పూర్తయి ధా న్యం, సేకరణ కేంద్రాలకు తరలించనున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు ప్రతి మండలంలో 100 టార్పాలిన్లు తహసీల్దార్ ఆధ్వర్యంలో రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అవసరం తీరిపోయాక టార్పాలిన్లు వాపసు చేయవచ్చని, రూ.650 చెల్లించి తీసుకోవాలని సూచించా రు. మండల వ్యవసాయాధికారి కార్యాలయం, లేదా రైతు సేవా కేంద్రాల ద్వారా వీటిని తీసుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment