క్రైమ్ పెరుగుతోంది
శ్రీకాకుళం క్రైమ్ : క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతోందని, శాంతిభద్రతలు పరిరక్షించేందుకు పోలీసులు చురుగ్గా పనిచేయాలని విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో భాగంగా డీఐజీ మంగళవారం సందర్శించారు. స్టేషన్‌లో ముఖ్య రికార్డులు, అన్ని రకాల కేసుల ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దర్యాప్తు ఎలా ఉన్నదీ ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, డీఎస్పీ సీహెచ్ వివేకానంద సమక్షంలో సీఐ పైడపునాయుడు, ఎస్‌ఐ ఎం.హరికృష్ణలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ ఆధ్వర్యంలో మహిళా పోలీసులతో ముఖాముఖి మాట్లాడారు.
గంజాయి, డ్రగ్స్‌పై ఎక్కువ ఫిర్యాదులు
కళాశాలలు, స్కూళ్లలో గంజాయి, డ్రగ్స్ వాడకం ఎక్కువ అవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఒడిశా నుంచే కాక మన ఆంధ్రాలోని కొన్ని మార్గాల్లో సైతం రవాణా చేస్తున్నారని అన్నారు. వాటి మూలలు తెలుసుకోవాలని సూచించారు. దీని పై మహిళా పోలీసులు సమస్యలు చెప్పగా.. సమాచారం ఉంటే ఎస్పీని నేరుగా సంప్రదించాలన్నారు. 100, 112, 1972ల ద్వారా ఎవరు సమాచారం ఇచ్చినా వారి వివరాలు తెలిసే అవకాశం లేదన్నారు. చిన్నారులు, మహిళలు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లలో ఇప్పటికే ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు.
జిల్లాలో 19 కీలక సైబర్ కేసులు
లోన్‌యాప్‌లు, ఆన్‌లైన్ గేమింగ్, ఆన్‌లైన్, యూ ట్యూబ్ వేదికగా జాబ్‌లిప్పిస్తామని, డిజిటల్ అరె స్టు, ఓటీపీ లింక్, కష్టపడకుండా డబ్బులు సంపాదించే డిజిటల్ అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయ ని డీఐజీ అన్నారు. ఇప్పటికే 19 కేసులు నమోదయ్యాయని దీనికి మూడింతలు ఫిర్యాదులు అందనివి ఉంటాయని, ప్రజలను అప్రమత్తం చేయాలని, సైబర్ నేరానికి గురైతే 1930కు ఫోన్‌చేయాలన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. రేంజి పరిధిలో 41 ఎకరాల గంజాయి (అల్లూరి సీతారామరాజు జిల్లా) సాగు గుర్తించడం జరిగిందని, క్రయ విక్రయాలు, రవాణా నిర్మూలించేందుకు టెక్నాలజీ సాయంతో (డ్రోన్లు, సీసీ కెమెరాలు, జాగిలాలు) నిఘా పె ట్టామన్నారు. ఇటీవల వార్తల్లో ఉన్న పలాసలో పెరిగిన రౌడీయిజం, పక్కరాష్ట్రాల నుంచి సుపారీ గ్యాంగు రావడం, నకిలీ నోట్ల ముఠా నాయకుని పట్టుకోవడానికి రాజమండ్రి వెళ్లిన మన పోలీసులను అక్కడివారు దాడి చేయడం, జిల్లాకేంద్రంలో ఆర్మీకాలింగ్ వ్యవహారం మహిళల మెడల్లో గొలుసులు తెంపేసి దాడులకు పాల్పడటం వంటి అంశాలపై ఇప్పటికే ఎస్పీ విచారణ చేయిస్తున్నారని తెలిపారు.
బాలికలపై దాడులు, అత్యాచారాలు నమోదవుతున్నాయి
డ్రగ్స్, గంజాయిపైనా ఫిర్యాదులు వస్తున్నాయి
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
డీఐజీ గోపీనాథ్ జెట్టీ
సమావేశానికి హాజరైన మహిళా పోలీసులు
(ఇన్‌సెట్లో) మాట్లాడుతున్న
డీఐజీ గోిపీనాథ్ జెట్టి
Comments
Please login to add a commentAdd a comment