ఎగ్‌బాకుతున్న ధర
సర్వకాల సర్వావస్థల్లో పేదవాడికి అందుబాటులో ఉండే గుడ్డు ఇప్పుడు క్రమేపీ ఆ వర్గానికి దూరమవుతోంది. గత నెలలో సుమారు రూ.6 ఉన్న ఒక కోడి గుడ్డు ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ.8కు పెరిగిపోయింది. ధనుర్మాసంలో కూడా గుడ్డు ధర ఇంతలా పెరిగిపోవడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. జూలైలో రూ.5.50 ఉన్న గుడ్డు ధర ఇప్పుడు రూ.8 అయింది. వేసవికి ముందే ఒక గుడ్డు ధర రూ.10లకు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పాలనలో అన్ని ధరలు పెరిగిపోవటంతో కోడి గుడ్డు ధర పెంచక తప్పటం లేదని కోళ్ల ఫారం యజమానులు చెబుతున్నారు. కోళ్లకు ఉపయోగించే మేత ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరోవైపు గుడ్లు రవాణా చేసే వాహనాల డీజిల్ ధరలు, కోళ్ల ఫారంలో పనిచేసే కూలీల ధరలు, విద్యుత్ చార్జీలు పెరిగాయి. నిర్వహణ భారం తట్టుకోలేక చాలా మంది ఈ వ్యాపారం నుంచి తప్పుకుంటున్నారు. దీంతో ఉత్పత్తి తగ్గి ధర పెరుగుతోంది. –ఎల్‌ఎన్ పేట
కొనలేం.. తినలేం..
గత నెల రోజుల్లో గుడ్డు ధర బాగా పెరిగింది. కొన్ని రోజుల కిందటి వరకు ఒక గుడ్డు ధర రూ.6లు ఉండేది. ఇప్పు డు ఒక గుడ్డు ధర రూ.8 అయింది. ఇలా ధరలు పెరిగిపోతే పేద, సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారు గుడ్డు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది. – చింతాడ కృష్ణవేణి,
గృహిణి, తురకపేట, ఎల్.ఎన్.పేట
Comments
Please login to add a commentAdd a comment