● పురాతన మందిరం..
జిల్లా కేంద్రంలోని టౌన్‌హాల్ రోడ్డులో ఉన్న పురాతన చర్చి పునీత తోమాను దేవాలయం. దీన్ని 1845లో కట్టారు. అడ్డగట్ల ఇన్నయ్య ఇక్కడ మొదటి ఫాదర్‌గా వ్యవహరించారు. 1999లో దీన్ని పునరుద్ధరించారు. దీనిలో ఆరోగ్య మాత మందిరం ఉంది. వెయ్యిమంది ఒకేసారి ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా పెద్ద హాలు ఉంది. ఈ చర్చికి ఫాదర్‌గా బోనెల రాజు బైబిల్ ప్రవచనాలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా కేరల్స్‌ను ఈనెల 15 నుంచి 23 వరకు నిర్వహిస్తారు. 24 రాత్రి 11గంటల నుంచి 2గంటల వరకు క్రీస్తు పుట్టిన వేడుకలు జరుగుతాయని, 25 ఉదయం 10గంటలనుంచి కూడా ప్రార్థనలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.
–శ్రీకాకుళం కల్చరల్
Comments
Please login to add a commentAdd a comment