19న | - | Sakshi
Sakshi News home page

19న

Published Wed, Dec 18 2024 12:53 AM | Last Updated on Wed, Dec 18 2024 12:52 AM

19న

19న

అప్రెంటిస్‌ షిప్‌ మేళా

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని బలగ హాస్పటల్‌ జంక్షన్‌లో ఉన్న పారిశ్రామిక శిక్షణ కేంద్రం (డీఎల్‌టీసీ–ఐటీఐ)లో ఈనెల 19వ తేదీన అప్రెంటిస్‌షిప్‌ మేళా జరగనుందని డీఎల్‌టీసీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వై.రామ్‌మోహనరావు పేర్కొన్నా రు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ డీఎల్‌టీసీ వేదికగా మేథా సెర్వో డ్రైవ్స్‌ ప్రైవే ట్‌ లిమిటెడ్‌ సంస్థ, హైదరాబాద్‌ వారి ద్వారా నిర్వహించే ఈ మేళాకు ఐటీఐలో ఎంపికచేసిన ట్రేడుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. వెల్డర్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ ట్రేడుల్లో ఉత్తీర్ణులై 25 ఏళ్లలోపు వయ స్సు కలిగిన వారు రావాలన్నారు. మేళాకు హాజరైన అభ్యర్థులకు లిఖితపూర్వక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా కంపెనీ ప్రతినిధులు ఎంపిక చేస్తారని ఏడీ రామ్‌మోహనరావు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.15100 స్టైఫండ్‌తోపాటు ఈఎస్‌ఐ, కంపెనీ ఇతర అలవెన్సులు, సదుపాయా లు ఉంటాయన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు తమ బయోడేటా, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, రెండు పాస్‌ ఫొటోలతో హాజరుకావాలని ఆయన కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
19న 1
1/1

19న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement