శ్రీకాకుళం పాతబస్టాండ్: రైతులకు మేలు జరిగేలా మిల్లర్లు కృషి చేయాలని, మిల్లర్లంతా ఐక్యతగా ముందుకుసాగుదామని జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం నూతన అధ్యక్షుడు బోయిన రమేష్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మిల్లర్ల సంఘం భవనంలో నిర్వహించిన సమావేశంలో సంఘ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం మిల్లర్ల ఐక్యతకు నిరద్శనమన్నారు. 2016–19 మధ్య అధ్యక్షుడిగా పనిచేసినా ఆశించిన మేర మిల్లర్లకు న్యాయం చేయలేకపోయానని, ఈసారి మేరకు నాయకులు, జిల్లా మంత్రి, ఇతర పెద్దల సాయంతో కృషి చేస్తానని చెప్పారు. పూర్వ అధ్యక్షుడు వాసు హయాంలో జిల్లాలో మిల్లర్లకు సంపూర్ణ న్యాయం జరిగిందని, సంఘానికి అన్ని రకాలుగా న్యాయం చేశారని తెలిపారు. రైస్ మాఫియా ఆగడాలు వెలుగుచూడటంతో కూటమి ప్రభుత్వం మిల్లర్లను భూతద్దంలో చూస్తోందని, మిల్లర్లు స్వార్ధం వీడి ప్రభుత్వానికి, రైతులకు మేలు జరిగేలా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో పూర్వ అధ్యక్షుడు వాసు, కేవీ గోపాలకృష్ణ, శాశ్వత అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, గొండు కష్ణమూర్తి, చిన్నాల కూర్మినాయుడు, సుసరాం భూషణ్, తంగుడు జోగారావు, తంగుడు నాగేశ్వరరావు, జామి నర్సింహమూర్తి, లాడి రమేష్, తాలాసు కష్ణరావు, శాసనపూరి మురళీకష్ణ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment