రైతులు అప్రమత్తంగా ఉండాలి
జలుమూరు: ప్రస్తుత వర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి కె.త్రినాథ స్వామి అన్నారు. బుధవారం జోనంకిలో పొలంపిలుస్తోంది కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. సేంద్రియ ఎరువులు, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు. ఎరు వులు, పురుగు మందుల వినియోగంపై పలు యాజమాన్య పద్ధతులు వివరించారు. ప్రధానంగా అధిక దిగుబడులకు సస్యరక్షణ పద్ధతులు అవసరమన్నా రు. భూసార పరీక్షలు ప్రకారం వ్యవసాయం సాగు, ఎరువులు వేసుకోవాలన్నారు. ప్రస్తుతం రైతులు వర్షం దృష్ట్యా వరి కోతలు, నూర్పులు ఈ నెల 20 వరకూ వాయిదా వేసుకోవాలన్నారు. రైతులకు అవసరమైన టార్పాలిన్లు మండల కేంద్రంలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వీటిని రూ.650 చెల్లించి తీసుకోవాలని వాపసు ఇచ్చేస్తే రూ.650 తిరిగి చెల్లిస్తారని తెలిపారు. అనంతరం అపరాల సాగుపై రైతులకు మెలకువలు వివరించారు. ఆయనతోపాటు ఏడీ రవీంద్రభారతి, ఏఓ కె.సురేష్ కుమార్ ఉన్నారు.
అన్నదాత ఆందోళన
ఇచ్ఛాపురం రూరల్: అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. చేతికి వచ్చిన పంట చేజారిపోతుందేమోనని భయపడుతున్నారు. అల్పపీడనం రైతుల పాలిట శాపంగా మారక ముందే వ్యవసాయ అధికారుల సూచనలు మేరకు రైతులు అప్రమత్తమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment