అకృత్యాలు.. వికృత చేష్టలు..
● శిక్షణ, ఉద్యోగాల పేరుతో మోసం చేయడమే కాకుండా తన ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో చేరిన విద్యార్థులను హింసించాడు.
● ఏకంగా కాళ్లతో తన్ని, డేటా కేబుల్ వైర్‌తో కొడుతూ చాలామందికి నరకం చూపించాడు.
● శిక్షణలో చేరిన అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు.
● రకరకాల మెసెజ్‌లు, మాటలతో ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు.
● అంతటితో ఆగకుండా అమ్మాయిలున్న వసతి గృహంలో, వాష్ రూమ్‌ల్లో, పరుపులు ఉన్న రూమ్‌ల్లో సీసీ కెమెరాలు పెట్టాడు.
● ఒకసారి దొరికిపోయాక అది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అనుమతితోనే పెట్టానని నమ్మించే ప్రయత్నం చేశాడు.
● సీసీ కెమెరాల గుట్టు బయటకు రాకుండా ఉండటానికి అమ్మాయిలను కూడా భయపెట్టాడు.
● బయటకు చెబితే వీడియోలు బయటకు వస్తాయని, అసభ్యకర ఫొటోలు వెలుగు చూస్తాయని బెదిరించినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి.
● రమణ కోసం ఒక్క మాటలో చెప్పాలంటే రక్షణ రంగంలో ఉద్యోగాల పేరుతో ఓ నియంతలా.. సైకోలా వ్యవహరించాడనే విషయం బాధితుల మాటల్లో స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment