న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోండి
గార: జైలులో ఉండే ముద్దాయిలు, ఖైదీలు న్యాయసేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శుక్రవారం అంపోలు జిల్లా జైలులో సంస్థ కార్యదర్శి జిల్లా సీనియర్ జడ్జి ఆర్.సన్యాసినాయుడుతో కలిసి లైబ్రరీ, వంటగదులు, బ్యారెక్‌లను పరిశీలించారు. అనంతరం న్యా య అవగాహన సదస్సులో మాట్లాడుతూ జైలులో ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. బెయిల్‌కు సంబంధించి ప్రతి వారం న్యాయవాదులు, పారా వలంటీర్లను పంపించడం జరుగుతుందన్నారు. జైలు సూపరింటెండెంట్ వి.సన్యాసిరావు, దివాకర్ నాయుడు, పి.అంజనీకుమార్, హర్షవర్ధన్, వైద్య సిబ్బంది, లీగల్ ఎయిండ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment