పవన్ అనుచిత వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోరా ?
● ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
టెక్కలి: వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై చెప్పు చూపించి అనుచితంగా మాట్లాడాననే కారణంతో తనపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని, అయితే అప్పట్లో ఇదే పవన్‌కల్యాణ్ వైఎస్సార్‌సీపీ మంత్రులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోరా అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. పవన్‌పై ఎమ్మెల్సీ దువ్వాడ అనుచితంగా వ్యాఖ్యలు చేశారనే కారణంతో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఇటీవల పోలీసులు దువ్వాడకు నోటీసులు అందజేశారు. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శుక్రవారం టెక్కలి పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. పవన్ కల్యాణ్‌పై దుర్భాషలాడాననే కారణంతో తనకు నోటీసులు ఇచ్చారని అయితే అందులో తేదీ, సమయం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలుగా మంత్రి అచ్చెన్నాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని దువ్వాడ దుయ్యబట్టారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా తాను భయపడేది లేదన్నారు. పోలీసులతో తప్పుడు చర్యలకు ప్రోత్సహిస్తున్నారని ఇది మంచిది కాదన్నారు. ఎన్నికల మునుపు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా ఇలా కక్షపూరితమైన చర్యలపై దృష్టి పెట్టడం సిగ్గుచేటుగా ఉందని దువ్వాడ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment