‘పవర్ ప్రేమికుడు’కి మొదటి బహుమతి
జి.సిగడాం: స్థానిక మోడల్ పాఠశాలలో పదో తర గతి చదువుతున్న విద్యార్థులు విద్యుత్ వినియోగదారుల కోసం తీసిన లఘు చిత్రం ‘పవర్ ప్రేమికుడు’ రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. శుక్రవారం విజయవాడలో ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, ఏపీ జెన్‌కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు చేతులమీదుగా తెలుగు అధ్యాపకులు కోట తిరుపతిరావు, విద్యార్థులు వి.వైకుంఠరావు, డోల వరప్రసాదరావు, ఎ.ఈశ్వర్, ఆర్.తేజలకు రూ.20వేలు నగదు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఎపిఎస్‌ఈసిఎం) నిర్వహించిన పోటీల్లో పవర్ ప్రేమికుడు లఘు చిత్రంలో విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఎంఈఓలు అరసాడ రవి, ముళ్లు శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నా శామ్యేల్ లెంక, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment