యువకుడు అనుమానాస్పద మృతి
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ చినబడాం గ్రామంలో శుక్రవారం ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. గ్రామ సమీపంలోని చెట్టు వద్ద ఉరికి వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించారు. కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని చినబడాంకు చెందిన అట్టాడ మురళి(26)గా గుర్తించారు. పోలీసులు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి..
మురళి, అదే గ్రామానికి చెందిన అక్షయ అనే అమ్మాయి ఏడాది కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. అక్షయ తల్లిదండ్రులు వీరి వివాహానికి ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ ఇళ్ల నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడాది పా టు సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితంలో కొద్ది రోజులు కిందట కలహాలు ఏర్పడ్డాయి. గర్భం దా ల్చిన అక్షయ భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లి పోయింది. భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. భార్య అక్షయ, ఆమె తల్లిదండ్రులు ఇటీవల మురళితో గొడవపడ్డారని, తప్పుడు కేసులు కూడా పెట్టారని వారు పోలీసులకు వివరించారు. భార్య మురళిని వేధించేదని, ఆమె తీరుపై మురళి తీవ్రంగా మనస్తాపం చెందేవాడని మృతుడి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్య తరఫు వారే చంపేసి గ్రామంలోని ఎగువ చెరువు గట్టుపై చెట్టుకు ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించారని ఆయన ఆరోపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఏఏస్‌ఐ చంద్రరావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment