ఢీకొట్టి పరారైన ఆటో
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డులో ఉన్న శ్రీనివాస కూడలి వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వృద్ధుడు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని ఆటో అతివేగంగా వచ్చి ఆయనను బలంగా ఢీకొట్టింది. వృద్ధుడు గాయాలతో రోడ్డుపై పడిపోవడంతో ఆటో డ్రైవర్ పరారైపోయాడు. క్షతగాత్రుడిని పలాస మండలం చిన్నమాకన్నపల్లి గ్రామానికి చెందిన జుత్తు కామేష్‌గా గుర్తించారు. స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం అందించగా పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఢీ కొట్టి పరారైన ఆటోకు సంబంధించిన సీసీ పుటేజీలు కాశీబుగ్గ పోలీసులు సేకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment