జిల్లా దేవదాయ శాఖ ఇన్‌చార్జి అధికారిగా భద్రాజీ
అరసవల్లి: జిల్లా దేవదాయ శాఖ ఇన్‌చార్జి అధికారిగా వై.భద్రాజీకి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు జిల్లా అధికారిగా బాధ్యతల్లో ఉన్న ప్రసాద్‌పట్నాయక్ సెలవులోకి వెళ్లడంతో ఆ బాధ్యతలను అరసవల్లి ఈఓగా ఉన్న భద్రాజీకి అప్పగించారు. అరసవల్లి ఆలయానికి డిప్యూటీ కమిషనర్/ఈఓగా పనిచేస్తున్న భద్రాజీకి రథసప్తమి ఉత్సవాల నిర్వహణ బాధ్యతలున్న నేపథ్యంలో జిల్లా శాఖ ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా మూడు రోజుల పాటు నిర్వహించనున్న నేపధ్యంలో జిల్లా బాధ్యతలను పొరుగు జిల్లాలకు చెందిన అధికారులకు అప్పగించకుండా అరసవల్లి ఈఓకు అప్పగించడంపై సంబంధిత శాఖలోనే చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment