వేధింపులతో అభివృద్ధికి చెక్
అభివృద్ధి చూసి ఓర్వలేకనే..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఏ గ్రామ పంచాయతీలో చేపట్టని విధంగా ఇక్కడ పనులు చేశాం. వాటిని చూసి ఓర్వలేకనే అసూయపడి చెక్ పవర్‌ను రద్దు చేయించారు. ప్రగతిని పరిగణనలోకి తీసుకోకుండా తప్పుడు ఫిర్యాదులు చేసిన వారికి వత్తాసు పలుకుతూ జిల్లా పంచాయతీ అధికారి చర్యలకు ఉపక్రమించడం దారుణం. ఇది కేవలం కక్ష సాధింపు మాత్రమే.
– కొణపల సురేష్‌కుమార్, సర్పంచ్
కంచిలి:
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. అన్ని రంగాల్లో తన ఊరిని అభివృద్ధి చేసిన మఠం సరియాపల్లి పంచాయతీ సర్పంచ్ కొణపల సురేష్‌పై స్థానిక టీడీపీ నేతలు కక్ష కట్టారు. పంచాయతీలో ఎప్పుడూ జరగని స్థాయి లో అభివృద్ధి జరిగినప్పటికీ ఆయనపై ఫిర్యాదులు చేశారు.
ఆ ఫిర్యాదులకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడుల సిఫారసులతో జిల్లా పంచాయతీ అధికారులు ఆగమేఘాలపై చర్యలకు ఉపక్రమించారు. సర్పంచ్ సమాధానం ఇచ్చినా సంతృప్తి చెందకుండా చెక్‌పవర్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేశారు.
పంచాయతీలో జరిగిన కొన్ని అభివృద్ధి పనులు..
● పంచాయతీ పరిధి నారాయణబట్టి గ్రామం వద్ద మండల పరిషత్ నిధులతో ప్రయాణికులు విశ్రాంతి మండపం నిర్మించారు.
● మఠం సరియాపల్లి ప్రాథమిక పాఠశాల ప్రవేశ ద్వారాన్ని ఉపాధిహామీ నిధులతోపాటు తన సొంత నిధులతో నిర్మించారు.
● నెయ్యిల వీధిలో పంచాయతీ నిధులతో సామాజిక మండపం నిర్మాణం చేశారు.
● కొత్తవీధిలో మండల పరిషత్, పంచాయతీ నిధులతో సామాజిక మండపం నిర్మాణం చేశారు.
● దాలేశ్వరం గ్రామంలో ఎంపీపీ నిధులతో సామజిక మండపం నిర్మించారు.
● రాగుపురం గ్రామంలో ఎంపిపి, పంచాయతీ నిధులతో సామాజిక మండపం కట్టారు.
● దాలేశ్వరం గ్రామంలో ఎంపీపీ, ఉపాఽధిహామీ నిధులతో శ్మశాన మండపం ఏర్పాటు చేశారు.
● మఠం సరియాపల్లి గడప గడకూ వైఎస్సార్, గ్రామ పంచాయతీ నిధులతో వై.ఎస్.ఆర్ పార్కు ఏర్పాటు చేశారు.
● గ్రామ పంచాయతీ నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు.
● వైఎస్సార్ పార్కులో పిల్లలు ఆడుకునే వస్తువులను పంచాయతీ నిధులతో ఏర్పాటు చేశారు.
సరియాపల్లి సర్పంచ్ చెక్ పవర్ రద్దు
మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అశోక్ సిఫారసులతో చర్యలు
Comments
Please login to add a commentAdd a comment