అధినేత ఆలోచనల మేరకు నడుచుకోవాలి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ధర్మాన కృష్ణదాస్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఎచ్చెర్ల నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు అక్కడి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌తో కలిసి పనిచేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. అధినేత ఆలోచనల మేరకు నడుచుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. సమన్వయకర్తను విభేదిస్తూ ఆరోపణలు చేయడం సరికాదని, నక్కా ప్రసాద్, ఆబోతుల జగన్నాథం తదితర నాయకులు పార్టీ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని కోరారు. అందుకు భిన్నంగా వ్యవ హరిస్తే ఎంతటి వారిౖపైనెనా క్రమశిక్షణ చర్యలు తప్పవని కృష్ణదాస్ హెచ్చరించారు. సమన్వయకర్తతో కలిసి పనిచేసి, పార్టీ పటిష్టతకు పాటు పడాలని కోరారు.
గణిత మేధావికి ఘనమైన నివాళి
పాతపట్నం మండలంలోని కాగువాడ గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతిభా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల(ఎంజేబిపీఆర్)లో ప్రధా నోపాధ్యాయురాలు శ్రీరాములు ఆధ్వ ర్యంలో ఆదివారం శ్రీనివాస రామానుజన్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా 1729 రామానుజన్ సంఖ్య ఆకారంలో విద్యార్థినులు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
– పాతపట్నం
బీఆర్‌ఏయూకు పీఎం ఉషా
కింద రూ. 20 కోట్లు మంజూరు
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి పీఎం ఉషా కింద (ప్రధాన్ మంత్రి ఉచ్ఛతార్ శిక్ష అభియాన్) రూ. 20 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వివరాలు ఉత్తర్వులు అందజేసింది. గతంలో అధికారులు ప్రతిపాదనల మేరకు ఈ నిధులు మంజూరయ్యాయి. ఐటెప్ కోర్సు అకడమిక్ బిల్డింగ్, ఇంజినీరింగ్ ల్యాబ్‌లు, సైన్స్ ల్యాబ్, మహిళలు వసతి గృహం వంటి ప్రపోజల్స్ అధికారులు అందజేశారు. దేశంలో చాలా విద్యా సంస్థలకు పీఎం ఉషా పథకంలో భాగంగా నిధులు మంజూరయ్యాయి.
ఆదిత్యునికి విశేష పూజలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకోగా, ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ ఈఓ వై.భద్రాజీ తగు చర్యలు చేపట్టగా, అంతరాలయంలో గోత్రనామాలతో పూజలు జరిగేలా ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ చర్యలు చేపట్టారు. అలాగే దర్శన టిక్కెట్ల ద్వారా రూ.62,500, విరాళా లు, ప్రత్యేక పూజల టిక్కెట్ల ద్వారా రూ.83,459, ప్రసాదా ల విక్రయాల ద్వారా రూ.1.50 లక్షల వరకు ఆదాయం లభించినట్లుగా ఈఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment