No Headline
చిత్రంలో కనిపిస్తున్న దారులు ఇచ్ఛాపురం మండలంలోనివి. తులసిగాం నుంచి కేశుపురం వర కు గోతులు పూడ్చడానికి సుమారు రూ.15లక్షలతో ఇరవై రోజుల కిందట స్థానిక ఎమ్మెల్యే, విప్ బెందాళం అశోక్ ఈదుపురం వద్ద కొబ్బరికాయ కొ ట్టారు. పది రోజుల తర్వాత గుంతల్లో రాళ్లు వేశారు. బుధవారం రాత్రి సమయంలో హాట్‌మిక్సర్‌లో తారు, చిప్స్ కలిపి హడావుడిగా తిప్పనపుట్టుగ జంక్షన్ రోడ్డు వరకు ప్యాచ్‌వర్క్ చేశారు. గురువారం నుంచి వానలు కురవడంతో రోడ్డు అసలు రూపం బయటపడింది. తారు శాతం పూర్తిగా తక్కువగా ఉండటం వల్ల చిప్స్ తేలిపోయాయి. ఈ పనితనాన్ని చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. – ఇచ్ఛాపురం రూరల్
మార్గం.. దుర్మార్గం
Comments
Please login to add a commentAdd a comment