1100 సీసీ కెమెరాలు అవసరం: ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో చైన్‌స్నాచింగ్‌లు, చోరీలు పెరుగుతున్నా వాటిని ప్రణాళికాబద్ధంగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కేసుల గుర్తింపు శాతం 1.5 రెట్లు పెరిగిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పోలీసు కా ర్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాశీబుగ్గ, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో తోటల్లో సింగిల్‌గా ఇళ్లుండటంతో దొంగతనాలకు ఆస్కారమవుతుందన్నారు. పట్టణాలు, ముఖ్యకేంద్రాలు, కూడళ్లలో సీసీ కెమెరాలున్నా అలాంటి ప్రాంతాల్లో ఉండకపోవడంతో ఇబ్బందవుతుందన్నారు. ఇప్పటికే 900కు పైగా సీసీ కెమెరాలున్నా 1100కు పైగా ఉంటేనే చోరీలు అరికట్టేందుకు సులవవుతుందని, సీఎస్‌ఆర్ ఫండ్స్, పోలీసింగ్ ఫండ్సే కాక పబ్లిక్ నుంచి దాతల సహకారంతో మరిన్ని ఏర్పాటుకు కృషిచేస్తున్నామన్నారు. చోరీలు చేసే అంతర్రాష్ట్ర గ్యాంగులు రెండింటిని గుర్తించామని, జిల్లాలోని కొన్ని ప్రాంతాల యు వకులు స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment