జీఓతో హడావుడి
రాష్ట్ర పండగ కింద ఒక్క పైసా తీసుకురాని కూటమి నాయకులు మాత్రం ఈ జీఓను తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. ప్రసాదం స్కీం కింద కేంద్ర ప్రభుత్వానికి వెళ్లిన రూ. 76కోట్ల ప్రతిపాదనలను రూ. 100కోట్లగా చూపించి, అభివృద్ధి చేసేస్తున్నామని తాజా జీఓలో ఉటంకిస్తున్నారు. గత ప్రభుత్వం ఇంద్ర పుష్కరిణి కోసం ప్రత్యేకంగా రూ. 2కోట్లు విడుదల చేసింది. మరో రూ. 2కోట్లు దేవస్థానం నుంచి కేటాయిస్తూ అభివృద్ధి పనులకు ఉపక్రమించింది. కానీ కాంట్రాక్టర్ సమస్యతో పనులు ముందుకు సాగలేదు. ఈ ప్రభుత్వం వీటికి అదనంగా నిధులు ఇచ్చి అభివృద్ధి పనులను పరుగులు తీయిస్తే బాగుండేది. కానీ ఆ పని చేయకుండా పైసా నిధులివ్వకుండా రాష్ట్ర పండగగా గుర్తిస్తున్నట్టుగా విడుదల చేసిన జీఓ కేవలం ప్రచారమేననే వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment