33 టన్నుల జీడిపప్పు దగ్ధం
కాశీబుగ్గ: మందస మండలం హరిపురం గ్రామంలో ఉన్న వెంకటబాలాజీ కాష్యూ పరిశ్రమలో శనివారం అర్ధరాత్రి దాటిన అనంతరం మంటలు చెలరేగాయి. ఎగుమతులకు సిద్ధంగా 33 టన్నుల జీడిపప్పు కాలిబూడిదైందని పరిశ్రమదారులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని, స్థానికు లు ఇచ్చిన సమాచారం మేరకు పలాస, మందస అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ రూ.2.50 కోట్ల విలువైన 33 టన్నుల జీడిపప్పు కాలిపోయినట్లు ఫైర్ సిబ్బంది నిర్ధారించారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు పరిశీలించగా మందస పోలీసు స్టేషన్‌వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment