● 129 ఏళ్ల చరిత్ర
స్థానిక అంబేడ్కర్ కూడలిలో ఉన్న ఆంధ్రాబాప్టిస్టు చర్చిలో 129 ఏళ్లుగా ఏటా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 1889వ సంవత్సరంలో సంఘం స్థాపించినప్పటికీ 1905 సంవత్సరంలో కెనడాకు చెందిన క్రిష్టియన్ మిషనరీష్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధి ఆర్చి బాల్డ్ ఆధ్వర్యంలో ఫాస్టర్ డబ్ల్యూ.హేగెన్స్ పర్యవేక్షణలో ఈ చర్చిను ప్రారంభించారు. 2015 సంవత్సరానికి 120 ఏళ్లు పూర్తి కావడంతో ఈ చర్చిని పునర్నిర్మాణం చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఫాస్టర్ ఆర్.అప్పాజీ, సంఘం అధ్యక్షుడు డి.సుందర్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ ఏడాది క్రిస్మస్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రార్థనా గంట అప్పటిదే..
టెక్కలిలో సెంటినరీ ఆంధ్రాబాప్టిస్టు చర్చిలో సుమారు 129 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ప్రార్థన గంటను ఇప్పటికీ వినియోగిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో చర్చి ఫాస్టర్ ఈ ప్రార్థన గంటను మోగించిన తర్వాత క్రైస్తవ సోదరులు యేసుప్రభువుకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సుమారు 129 ఏళ్లుగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.
–టెక్కలి
Comments
Please login to add a commentAdd a comment