ప్రభుత్వం ఆదుకోవాలి
కవిటి: అకాల వర్షాలతో నష్టపోయన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కవిటి, పుటియదల, పుక్కలపాలేం తదితర ప్రాంతాల్లోని పంట పొలాలను ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అనూష ఆధ్వర్యంలో అధికారుల బృందం మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అవకాశం ఉన్నంతవరకు వరి పనలను ఆరబెట్టుకోవాలని, ఉప్పునీటిని పిచికారీ చేయాలని సూచించారు. అయితే రైతులు మాట్లాడుతూ ఈ పరిస్థితుల్లో పంటని గట్లపై వేయడానికి అధిక ఖర్చు అవుతుందని, అయినా కూడా పంట చేతికి వస్తుందనే నమ్మకం లేదని వాపోయారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు జగన్మోహన్‌రావు మాట్లాడుతూ.. ఉన్నతాధికారులకు తెలియజేసి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సోంపేట వ్యవసాయ అధికారి బొర్ర నరసింహమూర్తి, కవిటి మండల వ్యవసాయ అధికారి బడగల దుర్గాప్రసాద్, వ్యవసాయ సహాయకుడు మాదిన పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment