వృత్తి విద్య కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్లలోని రాష్ట్ర మహిళా సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్‌టీఆర్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో వృత్తి విద్యా శిక్షణలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేనేజర్ పి.విమల తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత ఆధారంగా అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్టు, 8వ తరగతి అర్హతగా టైలరింగ్ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. శిక్షణకు 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. పూర్తి వివరాల కు ఫోన్ నంబర్లు 9948530 183, 74167 64419 లను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ డీఐజీగా
తుంగతంపర వాసి
హిరమండలం: తుంగతంపర గ్రామానికి చెందిన చింతం వెంకటప్పలనాయుడు డీఐజీగా నియమితులయ్యారు. ఈ మేర కు తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు డీఐజీగా నియమితులయ్యారు. ఎయిర్‌పోర్టు ఇంటెలిజెన్స్ (ఎస్పీగా) ఎయిర్‌పోర్టు భద్రతాధికారిగా వ్యవహరించనున్నారు. వెంకటప్పలనాయుడు ఎంపికపై తుంగతంపర గ్రామపెద్దలు, యువకులు, మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలుపుతున్నారు.
మందసలో ప్రకృతి వ్యవసాయం స్టేట్ టీమ్ పర్యటన
కాశీబుగ్గ: మందస మండలంలో ఉన్న ప్రకృతి వ్యవసాయ యూనిట్‌లను రాష్ట్ర స్థాయి బృందం గురువారం సందర్శించింది. స్టేట్ టీమ్ నుంచి వచ్చిన వారిలో ప్రకృతి వ్యవసాయం రీజనల్ కో ఆర్డినేటర్‌లు ప్రకాష్, హేమసుందర్‌లు ఉన్నారు. మందస మండలం రాయకోల గిరిజన గ్రామం పంటపొలంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో సీడ్ ప్లాట్ పరిశీలించారు. సుమారు ఒక ఎకరా పొలంలో సీడ్ ప్లాట్ వే యించగా ఈ పంటలో వచ్చే విత్తనాలు ఖరీఫ్ సీజన్లో పీఎండీఎస్ విత్తనాలు కోసం ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో డీపీఎం మేడం రేవతి, అడిషనల్ డీపీఎం ధనుంజయ, ఎన్‌ఎఫ్‌ఏలు గోవిందరెడ్డి, ముసలయ్య, ఎంటి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
‘మైక్రో ఫైనాన్స్ వలలో పడితే అప్పులే’
కాశీబుగ్గ: గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం శక్తి సంఘాల సభ్యులు మైక్రో ఫైనాన్స్ సంస్థల వలలో పడి అప్పులు పాలు కావద్దని వెలుగు ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పైడి కూర్మారావు అన్నారు. గురువారం కొండలోగాం, కుసుమల పంచాయతీల్లో పర్యటిస్తూ టంగరపుట్టి గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. మహిళా సంఘాల స్థితి గతులు తెలుసుకొని కొద్దిమంది సభ్యులు వారి అత్యవసరాల మేరకు మైక్రో ఫైనాన్స్ సంస్థల బారిన పడి అధిక వడ్డీలు చెల్లిస్తున్న విషయం తెలుసుకొని పని చేస్తున్న సిబ్బందిపై విరుచుకుపడ్డారు. గతంలో బ్యాంకులు నిరాకరించడం వల్లే మైక్రో ఫైనాన్స్ సంస్థలు గ్రామాల్లో అప్పులు ఇస్తున్నాయని సిబ్బంది చెప్పారు. దీంతో ఆయన అక్కడి నుంచే బ్యాంకు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సంఘం సేవింగ్స్ ఖాతాలో లక్షల కొద్దీ నిధులు ఉన్నా బ్యాంకుల సహకారం లేనందున మైక్రో ఫైనాన్స్ సంస్థల విచ్చల విడితనం పెరిగిపోయిందన్నారు. మందస మండలంలో ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా అంతర్గత అప్పులకు అవకాశం కల్పిస్తున్నందున సభ్యురాలి అవసరాల మేరకు గ్రూపు తీర్మానం చేసి అప్పులు ఇప్పించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఎంఎస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రాజారావు, క్లస్టర్ కో–ఆర్డినేటర్ స్వామి నాయుడు, వీఓఏలు జగబంధు, ఆనంద్‌తో పాటు వన్‌దన్ వికాస కేంద్ర సభ్యులు, గ్రామ సంఘాలు ప్రజాలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment