కన్నీటి వీడ్కోలు
పాలకొండ/వీరఘట్టం: రాజకీయ కురువృద్ధుడు పాలవలస రాజశేఖరం (81) అంతిమ వీడ్కోలు బుధవారం పాలకొండలో నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన అభిమానులు, ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, అధికార పార్టీ నాయకుల కన్నీటి నివాళుల నడుమ అంతిమ యాత్ర కొనసాగింది. అంపిలి గ్రామ సమీపంలోని నాగావళి నదీ తీరంలో అంతిమ సంస్కారాలను సంప్రదాయబద్ధంగా జరిపారు. ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తలకొరివి పెట్టగా, కుమార్తె రెడ్డి శాంతి, కుటుంబ సభ్యులు పార్థివదేహం చుట్టూ ప్రదక్షిణ చేసి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, గొర్లె కిరణ్‌కుమార్, శంబంగి వెంకట చినప్పలనాయుడు, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని, డోల జగన్, గొండు కృష్ణమూర్తి, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తదితరులు రాజశేఖరం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పాలకొండలోని నాగావళి నదీతీరంలో
అంత్యక్రియలు
అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలు, రాజకీయ ప్రముఖులు
Comments
Please login to add a commentAdd a comment