ఘనంగా గోదా రంగనాథుల కల్యాణోత్సవం
కూర్మనాథాలయంలో గోదా రంగనాథుల కల్యాణోత్సవం
గార: శ్రీకూర్మం క్షేత్రంలో గోదారంగనాథుల కల్యా ణోత్సవం వైభవోపేతంగా జరిగింది. తిరుప్పావైలోని 30 పాశురాలు ముగింపు రోజున సంప్రదాయం అనుసరించి మంగళవారం (సంక్రాంతి) ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి, సీతమ్మ, గోదాదేవి, చతుర్భుజ తాయారు (లక్ష్మీదేవి)లను ఊరేగింపుగా తీసుకెళ్లగా భక్తులు హారతిలిచ్చారు. అనంతరం గోదాదేవికి విరాటోత్సవం పేరిట విశేష అభిషేకాలు (తిరుమంజనసేవ) నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో జి.గురునాథరావు, ప్రధానార్చకులు చామర్తి సీతారామనృసింహాచార్యులు, స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment