ఆకట్టుకున్న ప్రదర్శన
హిరమండలం: సంక్రాంతి అంటేనే సంప్రదాయాలు, సంస్కృతుల మేళవింపు. పండగ నాడు గిరిజనులు తమ సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా లోకొండ గ్రామంలో ‘మేమే గుర్రం’ అంటూ ప్రదర్శించిన నృత్యం అబ్బురపరిచింది.
శ్రీముఖలింగంలో గోపూజ
జలుమూరు: గోసంరక్షణ చేయడమంటే 60 వేలమంది దేవతలను ప్రసన్నం చేసుకోవడమేనని శ్రీముఖలింగం ఆలయం అర్చకులు అభిప్రాయపడ్డారు. బుధవారం కనుమ సందర్భంగా శ్రీముఖలింగం ప్రధాన దేవాలయం పరిధిలోని రాధాగోవిందస్వామి, భీమేశ్వర, సోమేశ్వర ఆలయాల్లో గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీదేవికి ప్రతీక గోవు అని, అందరూ గోవులను పూజించాలని కోరారు. దేవదాయ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోపూజ నిర్వహించినట్లు ఈఓ ప్రభాకరరావు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment