వైభవంగా కనుమ ఉత్సవం
గార: కనుమ పర్వదినం సందర్భంగా ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మనాథాలయం ఉపాలయమైన తండ్యాలపేటలోని అభయవరద వీరాంజనేయ స్వామి ఆలయంలో కనులపండువగా జరిగింది. బుధవారం ఉదయం నుంచి ఉత్తరముఖంగా దర్శనమిస్తున్న స్వామి మూర్తికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీకూర్మనాధాలయం నుంచి స్వామిమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, లక్ష్మణ సమేత సీతారామచంద్రులను రెండు పల్లకిల్లో ఊరేగింపుగా తీసుకువచ్చారు. సుమారు 3 కిలోమీటర్లు మేర సాగిన తిరువీధిలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తుల వద్దకు భగవంతుడనేదానికి ఈ వేడుకే నిదర్శనమని, తిరుమలలో పార్వేట ఉత్సవం మాదిరిగా దీనిని కనప ఉత్సవమని పిలుస్తుంటారని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో కూర్మనాథాలయ ప్రధానార్చకులు సీహెచ్ సీతారామనృసింహాచార్యులు, తండ్యాలపేట అర్చకులు గోపినంబాళ్ల కూర్మరాజాచార్యులు, ఆలయ ఈవో జి.గురునాథరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment