పలువురిపై కేసు నమోదు
ఎల్.ఎన్.పేట: సంక్రాంతి, కనుమ పండగ సందర్భంగా గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, శాంతి భద్రతలకు నష్టం కలిగించిన పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎల్.ఎన్.పేట మండలం తురకపేట సెంటర్‌లో అక్రమంగా బెల్ట్‌షాపుల్లో మద్యం విక్రయిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేశామని ఎస్సై బి.హైమావతి తెలిపారు. కరకవలస, శ్యామలాపురం ఆర్‌ఆర్ కాలనీ, పెద్దకోట, డొంకలబడవంజ, సరుబుజ్జిలి మండలం కొత్తకోట గ్రామాల్లో పిక్కాట, పేకాట ఆడుతున్న 17 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు.
● పాతపట్నం: మేజర్ పంచాయతీ పరిధిలోని కోటగుడి కాలనీలో పేకాట శిబిరంపై దాడి చేసి ఎనిమిది మందిని, చంగుడి గ్రామంలో పేకాట శిబిరంపై దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశామని ఎస్‌ఐ బి.లావణ్య తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.30,300, రూ.9,030 చొప్పున నగదు స్వాదీనం చేసుకున్నామని చెప్పారు.
● పాతపట్నం: మండలంలోని ఆర్.ఎల్.పురంలో బుధవారం ఓ మహిళ వద్ద 52 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఏఎస్‌ఐ సింహాచలం తెలిపారు.
● సోంపేట: మండలంలోని రుషికుడ్డ గ్రామంలో ఒక వ్యక్తి వద్ద నుంచి 8 మద్యం బాటిళ్లు, జింకిభద్రలో 6 మద్యం బాటిళ్లతో మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ లవరాజు తెలిపారు.
● పాతపట్నం: మండలంలోని సింగుపురం, గంగువాడ గ్రామాల్లో డొక్కుఅట్ట పిక్కాడ ఆడుతుండగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ బి.లావణ్య తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.5,070, రూ.2,350, రూ.5,800 చొప్పున నగదు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామని చెప్పారు.
ఉద్దానం యువ కవి ప్రతిభ
పలాస: మండలంలోని మాకన్నపల్లి గ్రామానికి చెందిన యువ కవి కుత్తుం వినోద్ తన కవితల ద్వారా ప్రజలు మన్ననలు పొందుతున్నాడు. అమెరికాలోని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా)ఆధ్వర్యంలో ప్రచురితమవుతున్న ‘అమెరికా భారతి’ జనవరి సంచికలో ‘ఒక తుఫాను రాత్రి’ అనే శీర్షికతో తన కవిత ప్రచురితమైందని వినోద్ బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలు అభినందనలు తెలియజేశారు.
బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
కొత్తూరు: కొత్తూరు కాలేజీ రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కొత్తూరు చెందిన సిల్లా చక్రవర్తి పారాపురం వెళ్తుండగా వెనుక నుంచి మరో బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే క్షతగాత్రుడికి సీహెచ్‌సీలో ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. చక్రవర్తి కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎండీ అమీర్ ఆలీ తెలిపారు.
కోడిరామ్మూర్తికి ఘనంగా నివాళి
శ్రీకాకుళం న్యూకాలనీ: కలియుగ భీముడిగా కితాబు అందుకున్న కోడి రామ్మూర్తినాయుడు(కేఆర్‌ఎన్) వర్ధంతిని బుధవారం శ్రీకాకుళంలో నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని కోడిరామ్మూర్తి విగ్రహానికి డీఎస్‌డీవో డాక్టర్ కె.శ్రీధర్‌రావు, కోచ్‌లు గాలి అర్జున్‌రావురెడ్డి, ఇప్పిలి అప్పన్న, కై లాష్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీలంక తెలుగు బౌద్ధ భిక్షువు బోధిహీన్ హాజరై కోడి రామ్మూర్తినాయుడు విగ్రహానికి నివాళ్లర్పించారు. ఇండియన్ హెర్క్యులస్‌గా పేరొందిన కోడిరామ్మూర్తి శ్రీకాకుళం జిల్లా వాసి కావడం సిక్కోలుకు గర్వకారణమన్నారు. తెలుగురువారే కాకుండా యావత్ భారతదేశం గర్వించదగ్గ మల్లయోధుడు కోడిరామ్మూర్తి అని డాక్టర్ గుండబాల మోహన్ కొనియాడారు.
ఉత్సాహంగా
కోడెబళ్ల సంబరం
పొందూరు: సంక్రాంతి పండగ నేపథ్యంలో కోడెబళ్లు సంబరాలు ఉత్సాహంగా సాగాయి. లోలుగు, రాపాక, పొందూరు, కనిమెట్ట తదితర గ్రామాల్లో సంక్రాంతి నాడు ప్రధాన వీధుల్లో ఎడ్లను పరుగులు తీయించటం ఆనవాయితీగా వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment