● కోలాహలంగా హలాహలేశ్వరుని యాత్ర
శ్రీరాంపాడులోని హలాహలేశ్వర యాత్రకు భక్తులు పోటెత్తారు. వేలాది మంది మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. రెడ్డికిపేట–అంపలాం మధ్య బసివలస రోడ్డుకు ఆనుకుని ఉన్న మల్లికార్జున స్వామి శివాలయ ప్రాంగణంలో ఏటా మాదిరిగానే గురువారం యాత్ర జరిగింది. సాయంత్రం రెండు గంటల నుంచే భక్తులు రాక ప్రారంభం కాగా సాయంత్రం ఐదు గంటల సరికి భక్తులు అధికంగా తరలిరావడంతో యాత్ర ప్రాంగణం అంతా కిటకిట లాడింది. ఆలయ కమిటీ ఆద్వర్యంలో భక్తులకు ప్రసాదం ఉచితంగా పంపిణీ చేశారు. కంబకాయ లో కూడా స్వయంభువేశ్వరా ఆలయం 75 వార్షికోత్సవం సందర్భంగా గ్రామ ప్రధాన కూడలిలో యాత్ర నిర్వహించారు. వందలాది మంది యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
–నరసన్నపేట
Comments
Please login to add a commentAdd a comment