రహదారి భద్రత వారోత్సవాలు ప్రారంభం
శ్రీకాకుళం అర్బన్: కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం శ్రీకాకుళం 1వ డిపో గ్యారేజ్ ఆవరణలో ప్రారంభోత్సవ సభను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం పట్టణ ట్రాఫిక్ ఎస్‌ఐ దేవదానం హాజరై మాట్లాడారు. రహదారిపై భారీ వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రత ప్రధానమని, భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యాన్ని ప్రయాణికులకు కల్పించాలని కోరారు. 1వ డిపో మేనేజర్ అమరసింహుడు మా ట్లాడుతూ ప్రమాద రహిత, సుఖవంతమైన సురక్షితమైన ప్రయాణాన్ని ప్రయాణికులకు అందించడం ద్వారా వారి మన్ననలు పొందాలని కోరారు. కార్యక్రమంలో రెండో డిపో మేనేజర్ శర్మ, 1,2 డిపోల సహాయ మేనేజర్లు రమేష్, గంగరాజు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎల్.ఎస్.నాయుడు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్లు భాస్కరరావు, మూర్తి, అసోసియేషన్ ప్రతినిధులు, భద్రత, నిఘావిభాగం ప్రతినిధుల డ్రైవర్లు, మెకానిక్‌లు, పీఆర్‌ఓ సుమన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment