పరీక్షలకు సిద్ధమా..?
సంచారం.. సంచార జాతుల సంప్రదాయాలు విభిన్నమైనవి. వాటిని తూచా తప్పకుండా పాటిస్తారు. –8లో
వెనుకబడిన
విద్యార్థులపై దృష్టి..
కళాశాలలో ఇంటర్మీడియెట్ 518 మంది చదువుతున్నారు. వీరంతా మార్చి 1 నుంచి జరిగే పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను సమాయత్తం చేస్తున్నాం. అలాగే ప్రాక్టికల్స్‌కు 90 మంది సన్నద్ధమవుతున్నారు. వెనుకబబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. రివిజన్‌లు చేయిస్తున్నాం. ప్రాక్టికల్స్ కోసం తీర్చిదిద్దుతున్నాం.
– బొమ్మలాట శ్యామ్‌సుందర్,
ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల
ఆమదాలవలస
విద్యార్థులను సిద్ధం చేయాలి
2024 మార్చి 17 నుంచి పదోతరగతి విద్యార్థుల పరీ క్షలు మొదలుకానున్నాయి. ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. పరీక్షలకోసం అన్ని యాజమాన్యా ల పరిధిలో 28,938 మంది ఫీజులు చెల్లించారు. వీరంతా పరీక్షలకు సమాయత్తమవుతున్నారు. గత నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో మొద టి మూడుస్థానాల్లో నిలుస్తున్నాం. శతశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలి.
– డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య,
జిల్లా విద్యాశాఖాధికారి శ్రీకాకుళం
శ్రీకాకుళం న్యూకాలనీ: పండగ ముగిసింది. విద్యార్థులకు ఇక అసలైన పరీక్ష కాలం మొదలైంది. విద్యార్థి జీవితంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ అతి కీలకమైన పరీక్షలు. ఈ రెండు పరీక్షలకు సమయం సమీపిస్తోంది. ఇప్పటికే ఈ పరీక్షలకు షెడ్యూల్ ఖరారు కావడంతో విద్యార్థులు సంసిద్ధంగా ఉన్నారు.
మొదలైన పరీక్షల ఫీవర్..
జిల్లాలో చదువుతున్న టెన్త్, ఇంటర్మీడియెట్ విద్యార్థుల్లో పరీక్షల ఫీవర్ మొదలైంది. ఇంటర్ పరీక్షలకు ఇంకా 45రోజులు,టెన్త్ పరీక్షలకు 60రోజులు మాత్ర మే వ్యవధి ఉంది. ఇప్పటికే పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్ అధికారులు.. విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసే దిశగా పలు కార్యక్రమాలను పకడ్బందీ గా అమలు చేస్తున్నారు. స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నా రు. రోజువారీ స్లిప్ టెస్టులు, వారాంతపు పరీక్షలు, 100 రోజుల ప్రణాళిక, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా ఫోకస్, టాపర్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి సానబెడుతున్నారు. సకాలంలో సిలబస్‌లను పూర్తిచేయడంతోపాటు రివిజన్‌లు చేసే పని లో ఉపాధ్యాయులు, లెక్చరర్లు నిమగ్నమై ఉన్నారు.
ఇంటర్ పరీక్షలకు 40,856 మంది..
2024 మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు మొదలుకానున్నాయి. ఇంటర్ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి ఒకటి నుంచి పరీక్షలు మొదలై.. 20వ తేదీతో ముగుస్తాయి. కాగా ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఫిబ్ర వరి 1వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, ఫిబ్రవరి 3వ తేదీన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యు కేషన్ పేరిట తప్పనిసరి పరీక్షలు జరగనున్నాయి. ఈ రెండు పరీక్షలను ఆయా కళాశాలల్లో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ప్రీపబ్లిక్ పరీక్షలను జనవరి 20 నుంచి నిర్వహించనున్నారు. అలాగే ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో ఫంక్షనింగ్ జరుగుతున్న కళాశాలలు 164 ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 38, సోషల్ వెల్ఫేర్ 9, ట్రైబల్ వెల్ఫేర్ 1, మోడల్ స్కూల్/కళాశాలలు 13, కేజీబీవీలు 25, హైస్కూల్ ప్లస్ కాలేజీలు 6, ఎంజేఏపీజేసీ 1 కోపరేటివ్ 2, ప్రైవేటు కళాశాలలు 69 ఉన్నాయి. వీటిల్లో 40,856 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ పరీక్షకు ఫీజులు చెల్లించారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 20,702 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 20,154 మంది ఫీజులను చెల్లించారు. వీరంతా పరీక్షలకు హాజరు కానున్నారు.
టెన్త్ పరీక్షలకు 28,938 మంది..
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి మొ దలుకానున్నాయి. ఈ పరీక్షలు రోజు విడిచి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. 2023 మార్చిలో రోజు విడిచి రోజు నిర్వహించగా.. 2024 మార్చిలో మాత్రం వ రుసగా పరీక్షలను నిర్వహించారు. ఈ ఏడాది మళ్లీ రోజు విడిచి రోజు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం మా ర్చి 31వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఇదిలా ఉండగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు శ్రీకాకుళం జిల్లా నుంచి 590 ఉన్నత పాఠశాలల్లో మొత్తం 28,938 మంది విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 27,690 మంది, ప్రైవేటు విద్యార్థులు (గతంలో ఫెయిలైనవారు) 1248 మంది ఉన్నారు.
ప్రణాళికాబద్ధంగా..
మా పాఠశాలలో 76 మంది చదువుతున్నారు. వారికి ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం. డెయిలీ టెస్టులను, వారాంతపు టెస్టులను తయారు చేస్తున్నాం. విద్యాశాఖ ప్రకటించిన 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నాం. పాత ప్రశ్న పత్రాలు, మోడల్ పేపర్స్‌తో పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం. – ఎ.వెంకటమురళీకృష్ణ, హెచ్‌ఎం, బలగ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్
సిలబస్‌లను త్వరితగతిన పూర్తిచేయాలి
ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు 2024 మార్చి ఒకటి నుంచి జరగనున్నాయి. షెడ్యూల్ వెలువడింది. పునర్విభజన శ్రీకాకుళం జిల్లాలో 40,856 మంది విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. వీరంతా ఫీజులు చెల్లించారు. అన్ని యాజమాన్య జూనియర్ కళాశాలల్లో సిలబస్‌లను త్వరితగతిన పూర్తిచేసి, రివిజన్‌లు చేపించాలి. ప్రాక్టికల్స్‌కు సిద్ధం చేయాలి. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా ఫోకస్ చేసి, వారంతా ఉత్తీర్ణులయ్యేలా చేయాలి. – ప్రగడ దుర్గారావు, జిల్లా ఆర్‌ఐఓ, ఇంటర్మీడియెట్ బోర్డు శ్రీకాకుళం
ముంచుకు వస్తున్న టెన్త్, ఇంటర్ పరీక్షలు
మార్చి ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం
మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు
రివిజన్ చేసే పనిలో నిమగ్నమైన గురువులు
Comments
Please login to add a commentAdd a comment