కేసు విచారణలపై దిశానిర్దేశం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జైలులో ఖైదీల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్య లు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జునైద్ ఆహ్మద్ మౌలానా అన్నారు. జిల్లాలో గల జైలు ముద్దాయిలకు చార్జిషీట్‌లు వేసి వారికి త్వరితగతిన వారికి న్యాయం చేకూర్చడానికి పోలీసు యంత్రాంగం, న్యాయవాదులు పని చేయాలని ఆదేశాలు ఇచ్చారు. గురువారం కోర్టు హాల్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జైలు ముద్దాయిల కేసుల విచారణపై పలు సూచనలు చేశారు. స్టేటటరీ కమిటీ 2023 – 2024 కు సంబంధించిన వార్షిక ఆదాయాల ఖర్చుల గురించి వివ రించారు. కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్, కేవీఎల్ హిమబిందు, కార్యదర్శి, ఆర్.సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌ఎం దృష్టికి ఇచ్ఛాపురం రైలు నిలయం సమస్యలు
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైలునిలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఖుర్ధాడివిజన్ డీఆర్‌ఎం హెచ్‌ఎస్ బజ్వా దృష్టికి డిఆర్‌యూసీమెంబర్ కట్టా సూర్యప్రకాష్ తీసుకెళ్లారు. గురువారం ఖుర్ధారైల్వే డివిజన్ కార్యాలయంలో డీఆర్‌ఎంని డీఆర్‌యూసీ మెంబర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం రైల్వేనిలయంలో నిర్మాణం చేయనున్న ఫుట్‌పాత్ వంతెనను పడమర వైపు పొడిగించాలని, రైల్వేస్టేషన్‌కి పడమర వైపు ప్రహరీ నిర్మాణం చేపట్టాలని, బాహుదానది పాతాల సిద్ధేశ్వరాలయం వద్ద గల ఉత్తరాయణంనకు వెళ్లేందుకు అండర్‌పాస్ నిర్మాణం చేపట్టాలని, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ని లింగంపల్లి వరకు పొడిగించేలా చర్యలు తీసుకోవాలని, సమీప రైల్వే స్టేషన్లు జాడుపూడి, బారువ స్టేషన్‌లో విశాఖ పాసింజర్ రైలుని నిలుపుదల చేయాలని వినతిపత్రం ద్వారా కోరారు. ఈ సందర్భంగా డీఓఎం సునీల్‌కుమార్, డీసీఎం నాయక్‌గిరీష్‌లను కూడా కలిశారు.
సరిహద్దులో వాహనాల తనిఖీ
పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద గురువారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఒడిశా నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఒడిశా నుంచి గంజాయి, మత్తు పదార్థాలు రాకుండా అడ్డుకట్ట వేయనున్నట్లు ఏఎస్‌ఐ సింహాచలం తెలిపారు. ఒడిశా నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులతో పాటు కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment