భక్తిశ్రద్ధలతో భావనా మహర్షి జయంతి
టెక్కలి: పట్టుశాలిల ఆరాధ్య దైవం భావనా మహర్షి జయంతి కార్యక్రమాలను గురువారం స్థానిక అక్కపు వీధిలో ఘనంగా నిర్వహించారు. పట్టణా నికి చెందిన పట్టుశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భావనా మహర్షి చిత్రపటానికి నివాళులు అ ర్పించారు. అనతంరం నిరుపేదలకు దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఇంజినీర్ పి.సింహాచలం, సంఘం అధ్యక్షుడు మల్లిపెద్ది మధుసూధనరావు, గౌరవ అధ్యక్షుడు దుంపా లోకేశం, సభ్యులు దుంపా శ్రీనివాస్, ఆట్ల పార్వతీశం, బస్వా శ్యామ్‌సుందర్, దుంపా మురళీమోహన్, వి.అశోక్, బుడ్డు నందికేష్, ఆట్ల విశ్వేశ్వర్రావు, కె.రఘనాథరావు, డి.సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment