ఎచ్చెర్ల క్యాంపస్: కుప్పిలి గ్రామానికి చెందిన నాయన గోవింద ఫిర్యాదు మేరకు బంగారం చోరీ కేసును ఎచ్చెర్ల పోలీసులు గురువారం నమోదు చేశారు. గత ఏడాది తొమ్మిదో నెలలో 10 గ్రాముల బంగారం చైన్ అదృశ్యమైంది, గుర్తించటంలో జాప్యంతో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్కౌట్స్‌అండ్ గైడ్స్ యూనిట్ మంజూరు
కొత్తూరు: కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ మంజూరైనట్లు హెచ్‌ఎం ఎ.గోవిందరావు గురువారం తెలిపారు. స్కౌట్స్‌లో, గైడ్స్‌లో చెరో 32 మంది చొప్పున్న 64 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు హెచ్‌ఎం చెప్పారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
ఆటోలు బోల్తా:
15 మందికి గాయాలు
సీతంపేట: ఆడలి వ్యూపాయింట్ ఘాట్ రోడ్‌లో రెండు ఆటోలు గురువారం సాయంత్రం వేర్వేరుగా బోల్తా పడిన సంఘటనలలో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో పలు వురి పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పాలకొండ మండలం వాటపాగు, బూర్జమండలం కురుంపేటలకు చెందిన గ్రామస్తులు ఆడలి వ్యూపాయింట్ చూడడానికి ఆటోల్లో వేర్వేరుగా వెళ్లారు. తిరిగి వస్తుండగా వెలంపేట మలుపు వద్దకు వచ్చేసరికి కురుంపేటకు చెందిన ఆటోను వెనుక వస్తున్న మరో ఆటో ఢీకొట్టడంతో లోయలో బోల్తాపడింది. పలువురికి గాయాలయ్యాయి. అక్కడే నిల్చుని ఉన్న వెల్లంగూడకు చెందిన గిరిజనుడైన సవర రెల్లయ్యపై ఆటో పడడంతో తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. కాగా వాటపాగు గ్రామానికి చెందిన మరో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఆ ఆటోలో ప్రయాణిస్తున్న వారికి కూడా గాయాలయ్యాయి
Comments
Please login to add a commentAdd a comment